మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఇరుముడి'. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఈ బుధవారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కథాంశం 41 రోజుల అయ్యప్ప దీక్ష నేపథ్యంలో సాగుతుంది. అయితే, ఈ చిత్రానికి శబరిమలకు ఎలాంటి సంబంధం లేదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. భక్తి అంశాలతో కూడిన ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది.
ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్రలో కనిపిస్తారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది.








