కన్నడ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న 'టాక్సిక్' సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం శనివారం రాత్రి 7 గంటలకు విడుదల చేసింది. బెంగళూరులోని ఏఎంబీ మాల్‌లో నిర్వహించిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అభిమానుల మధ్య ఘనంగా జరిగింది.

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యాక్షన్ జానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. హాలీవుడ్ నటులు, టెక్నీషియన్లు పనిచేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో బలమైన భావోద్వేగంతో పాటు హై-క్వాలిటీ విజువల్స్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. యష్ ఈ సినిమాలో డ్యుయల్ రోల్ పోషిస్తుండగా, కియారా అద్వానీ పాత్ర కూడా హైలైట్‌గా నిలవనుంది.

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కన్నడతో పాటు పలు ఇండియన్ భాషల్లో, ఇంగ్లీష్‌లో విడుదల కానుంది. ఇంగ్లీష్‌లో కూడా చిత్రీకరిస్తున్న మొట్టమొదటి కన్నడ చిత్రంగా 'టాక్సిక్' రికార్డు సృష్టించింది. గ్లోబల్ ఆడియెన్స్‌ను దృష్టిలో ఉంచుకుని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుతున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఈ సినిమా ఆగస్ట్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.