అయోధ్యలో రామ మందిర నిర్మాణ బాధ్యతలను చూస్తున్న 'శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్'ను పబ్లిక్ ట్రస్టుగా మార్చాలని నిర్మోహి అఖాడా సుప్రీంకోర్టును కోరింది. ప్రస్తుతం ఉన్న ట్రస్టు నిర్మాణం ప్రైవేటు పద్ధతిలో ఉందని, ఇది 2019లో అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు భిన్నంగా ఉందని అఖాడా తన దరఖాస్తులో పేర్కొంది.

రామ మందిర వ్యవహారాలను ఈ ట్రస్టు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో, ట్రస్టు స్వరూపాన్ని మార్చాలని కోరుతూ దాఖలైన ఈ దరఖాస్తుపై సుప్రీంకోర్టు జూలై 20న విచారణ చేపట్టనుంది.