మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్డే జంటగా నటించిన విలేజ్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. విడుదలైన మొదటి వారంలోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా, అఖిల్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
మొదటి వారం ముగిసిన తర్వాత కూడా సినిమా జోరు తగ్గలేదు. ముఖ్యంగా రెండో వారాంతంలో సాయంత్రం, సెకండ్ షోలకు ప్రేక్షకులు పోటెత్తడంతో థియేటర్లు హౌస్‌ఫుల్‌గా నడుస్తున్నాయని చిత్ర బృందం వెల్లడించింది.
థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగవంశీ, కింగ్ నాగార్జున నిర్మించారు. ప్రస్తుతం వస్తున్న వసూళ్లను బట్టి చూస్తే, ఈ వారాంతం ముగిసేసరికి సినిమా 100 కోట్ల గ్రాస్ మార్కును చేరుకునే అవకాశం ఉందని మేకర్స్ అంచనా వేస్తున్నారు.







