అమెరికా ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) జూలై 10 నుంచి హెచ్-1బీ వీసా, గ్రీన్ కార్డ్ దరఖాస్తులతో సహా అన్ని ఇమిగ్రేషన్ ప్రయోజన అభ్యర్థనలకు కొత్త సంతక నియమాలను విధిస్తోంది. ఈ నిబంధనల ప్రకారం, చేతిరాతతో చేసిన సంతకాలు లేదా సిరాతో చేయబడిన సంతకాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.
కాపీ-పేస్ట్ చేసిన సంతకాలు, టైప్ చేసిన పేర్లు, డిజిటల్ సంతక జనరేటర్లు లేదా సిగ్నేచర్ స్టాంప్లతో కూడిన దరఖాస్తులను USCIS అధికారులు తిరస్కరిస్తారు. చెల్లని సంతకాలను సరిదిద్దుకునే అవకాశం ఇవ్వబడదు. అయితే, ఇతర పత్రాలు సరిగ్గా ఉంటే మరోసారి సరైన సంతకంతో దరఖాస్తు చేయవచ్చని USCIS ప్రకటనలో తెలిపింది.
ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం USCIS నిర్దేశించిన ఎలక్ట్రానిక్ సంతకాలు మాత్రమే మినహాయింపు. అటార్నీలు లేదా ప్రతినిధులు చేసిన సంతకాలు కూడా చెల్లవు.






