రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో రాజ్ కుమార్ (29) మృతదేహం కనిపించింది. స్థానికులు అతన్ని గుర్తించిన తర్వాత డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వేగంగా స్పందించారు.
మృతుడిని ఆరు హత్యలకు పాల్పడిన రాజ్ కుమారర్‌గా నిర్ధారించారు. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ కనిపించడంతో ఆత్మహత్య సందేహం వ్యక్తం చేసారు పోలీసులు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు విచారణను తీవ్రతరం చేస్తున్నారు. నిందితుడు ఏ విధంగా మరణించాడో, హత్యల నేపథ్యం ఏమిటో ఇంకా స్పష్టంగా లేదు.







