రాజస్థాన్‌లోని దౌసా సాకేత్ కాలనీలో నివసించే రోహిత్ శర్మ శనివారం మధ్యాహ్నం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు గది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి, ఆయన్ని కిందకు దించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

రోహిత్ శర్మ తండ్రి హితేంద్ర మోహన్ శర్మ మెడికల్ షాప్ నడుపుతుండగా, ఆయన భార్య ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. 17 ఏళ్ల వయస్సులోనే నర్సింగ్ చదువుతూ జైపూర్‌లోని మానసరోవర్ షిప్రా పాత్ ప్రాంతంలో రోహిత్ శర్మ తన మొదటి టీ కేఫ్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన 'చాయ్‌వాలాజ్' పేరుతో వ్యాపారాన్ని విస్తరించారు.

వ్యాపారంలో రాణించిన రోహిత్ శర్మ, సుమారు ఆరు నెలల క్రితం తన ఏడు 'చాయ్‌వాలాజ్' అవుట్‌లెట్‌లను మూసివేశారు. ఆ తర్వాత ఆయన ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్లి పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. వ్యాపారంతో పాటు దౌసాలో సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొనేవారు.