న్యూఢిల్లీ: మొబైల్ టవర్ సిగ్నల్ లేని ప్రాంతాల్లో కూడా ఫోన్ కాల్స్ చేయగలిగే బీఎస్‌ఎన్‌ఎల్ శాటిలైట్ ఫోన్‌ను ఇప్పటివే ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ప్రత్యేకంగా అడవులు, సముద్రతీరాలు, పర్వత ప్రాంతాలు, విపత్తు తర్వాతి ప్రాంతాల్లో పనిచేసే రక్షణ దళాలు, సముద్ర రవాణా సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు మరియు సాహస యాత్రికులను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది.
ఈ ఫోన్ నేరుగా ఉపగ్రహాలతో కనెక్ట్ అవుతుంది. సెల్యులార్ నెట్‌వర్క్ లేకపోయినా వాయిస్ కాల్స్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ధర రూ.1,34,166 కాగా, ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ముందు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
ఈ ఫోన్‌ను ఉపయోగించి రక్షణ శాఖ, గనుల పరిశ్రమ, మారుమూల ప్రాంతాల్లో పనిచేసే సంస్థలు మరియు సాహస యాత్రికులు తమ కమ్యూనికేషన్ అవసరాలను తీర్చుకోవచ్చు. విపత్తు సమయంలో కూడా ఇది నిరంతర కనెక్టివిటీని అందిస్తుంది.







