పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో టాస్క్‌ఫోర్స్ బృందాలు శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ దాడుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన 80 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 2.25 లక్షలకు పైగా ఉంటుందని అంచనా.

గోదావరిఖనిలో 50 క్వింటాళ్లు, నస్పూర్‌లో 30 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించి గోదావరిఖనిలో ఇద్దరిని, నస్పూర్‌లో ఒకరిని మొత్తం ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని తదుపరి విచారణ కోసం స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.