పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆర్థిక దిగ్బంధనం, ఆహార పదార్థాల కొరత, మందుల లోపం వల్ల ప్రజలు తీవ్ర మానవతా సంక్షోభంలో ఉన్నారు. జేఏఏసీ నేత సర్దార్ అమన్ ఖాన్ ఈ పరిస్థితులను బహిరంగంగా వివరించి, భారతదేశం నుంచి మానవతా దృక్పథంతో సహాయం కోరారు.

రావలకోట్ ఈద్గా మైదానంలో జరిగిన భారీ సభలో, సర్దార్ అమన్ ఖాన్ ప్రశ్నించగా, 'అవును, సరిహద్దుల వైపు దూసుకెళ్దాం' అని వేలాది మంది ప్రజలు నినాదాలు చేశారు. పాక్ భద్రతా దళాలు నిరసనకారులపై బుల్లెట్లు విరుచుకుపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

పూంచ్, దోడా సెక్టార్ల వద్ద లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌ఓసీ)ను తెరవాలని జేఏఏసీ డిమాండ్ చేసింది. ప్రజలు 'పీఓకే పాకిస్తాన్‌లో భాగం కాదు', 'మాకు స్వేచ్ఛ కావాలి' అని నినాదాలు చేస్తున్నారు.

జులై 9న ఫైనల్ యాక్షన్ ప్రారంభిస్తామని జేఏఏసీ పాక్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ఆ రోజు పీఓకేలో ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, యూఎన్‌వో ప్రతినిధులు, అంతర్జాతీయ మీడియా, మానవహక్కుల సంఘాలను ఆహ్వానించింది. ఈ డెడ్‌లైన్ వరకు క్షమశిక్షణతో వ్యవహరించాలని తన మద్దతుదారులను కోరింది.