అసోం రాష్ట్రంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. శివసాగర్, చరైదేవ్, జోర్హాట్, గోలాఘాట్, నాగావ్, దిబ్రూగర్ జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది.
గత 24 గంటల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయడంతో, ఈ ఏడాది వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 66కి చేరుకుంది. శివసాగర్ జిల్లాలో ముగ్గురు, చరైదేవ్‌లో ఒకరు మరణించారు. వరదల కారణంగా 810 గ్రామాలు నీటమునిగాయి, 34,970.8 హెక్టార్ల పంట పొలాలు దెబ్బతిన్నాయి.
ప్రభుత్వం ఆరు జిల్లాల్లో 274 సహాయ శిబిరాలు, పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 18,902 మంది బాధితులను ఆశ్రయం చేసింది. బ్రహ్మపుత్ర, దిఖౌ, ధన్‌సిరి నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. ప్రధాని మోదీ వరద పరిస్థితులపై దృష్టి సారించారు, అవసరమైతే కేంద్ర సహాయం ఉంటుందని హామీ ఇచ్చారు.





