గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కెవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘టాక్సిక్’ చిత్రంలో యశ్ నటనతో పాటు సహ-నిర్మాతగా కూడా పాల్గొంటున్నాడు. ఆయనకు ₹50 కోట్ల ఫిక్స్డ్ రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో భారీ వాటా ఉంటుంది.
ఈ చిత్రంలో హీరోయిన్ల పారితోషికాలు కూడా అత్యధికంగా ఉన్నాయి. కియారా అద్వానీ ₹15 కోట్లు, నయనతార ₹12 కోట్లు తీసుకున్నారు. తారా సుతారియా, రుక్మిణి వసంత్‌లకు ₹3 కోట్లు చొప్పున, హుమా ఖురేషికి ₹2 కోట్లు చెల్లించారు.
దర్శకులు, సాంకేతిక నిపుణుల ఖర్చులతో కలిపి రెమ్యునరేషన్ల కోసం మాత్రమే ₹100 కోట్లు ఖర్చు చేయబడ్డాయి. ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నది.








