సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలోని కళ్యాణ్‌పురి ప్రాంతంలో స్కూటీపై వెళ్తున్నప్పుడు 26 ఏళ్ల టీచర్ ప్రియాంకతో జరిగిన వాగ్వాదం తీవ్రమైంది. ఆగ్రహించిన మనీష్ భాటి తన వద్ద ఉన్న పిస్టల్‌తో ప్రియాంకపై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

రక్తస్రావంతో రోడ్డుపై పడిపోయిన ప్రియాంకను దగ్గరలోని వ్యక్తులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెను లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నప్పటికీ మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మనీష్ భాటి ఢిల్లీ పోలీస్ శాఖలో తూర్పు జిల్లాలోని యాంటీ ఆటో థెఫ్ట్ స్క్వాడ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ప్రియాంక పుట్టిన రోజే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. పరారీలో ఉన్న మనీష్‌ను అరెస్ట్‌ చేయడానికి ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.