దమ్మపేట మండలంలోని పెద్దగొల్లగూడెం గ్రామంలో మళ్లా సత్యానికి చెందిన 5 ఎకరాల అసైన్డ్ భూమిని అక్రమంగా నామా పుష్పవతి పేరు మీదకు మార్చారు. సత్యం మరణించాడని, పుష్పవతి మాత్రమే వారసురాలని నకిలీ డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లను సృష్టించి ఈ బదలాయింపు చేపట్టారు. అయితే, సత్యం బతికే ఉండటం, అతడికి ఇతర సంతానం కూడా ఉండటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఇదే తరహాలో ముష్టిబండ రెవెన్యూ పరిధిలో మరో 4.01 ఎకరాల భూమిని ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా రికార్డుల మార్పు ద్వారా నల్లగుళ్ల స్వరూపరాణి పేరు మీదకు మార్చారు. ఈ అక్రమాలపై మీడియాలో కథనాలు రావడంతో భద్రాద్రి కలెక్టర్ అంకిత్ స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కొత్తగూడెం ఆర్డీవో మధును ఆదేశించారు.
ఆర్డీవో మధు జరిపిన విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్ అంకిత్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. తహసీల్దార్ రామ్‌నరేశ్, జీపీవో అనంతమ్మల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వారిని సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, దమ్మపేట తహసీల్దార్‌గా శిక్షణలో ఉన్న డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని డిప్యూటేషన్‌పై నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు.






