హైదరాబాద్ పాతబస్తీలోని టీక్రీ ప్రాంతంలో ఆదివారం మహ్మద్ ఫైజ్ (17) అలియాస్ అజాన్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఫైజ్‌ను గుర్తుతెలియని వ్యక్తి కత్తితో పొడిచి చంపినట్లు కాలపత్తర్ పోలీసులు తెలిపారు.
ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ఉన్న సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించి కేసు నమోదు చేశారు.
ఈ హత్యకు స్థానికంగా ఉంటున్న రౌడీషీటర్ కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.








