గరుడ పురాణం ప్రకారం మరణం కేవలం శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తికి తన జీవితకాలంలో ఉపయోగించిన బట్టలు, నగలపై మోహం ఉంటుంది. ఈ వస్తువులను ఇంట్లో దాచి ఉంచడం వల్ల ఆ ఆత్మకు శాంతి లభించదని, కుటుంబ సభ్యులు ఆ బాధను త్వరగా తొలగించలేరని పురాణం స్పష్టం చేస్తుంది.
బంగారు, వెండి నగలను కుటుంబ వారసత్వంగా భావిస్తారు. కానీ చేతి గడియారాలు పాడైతే లేదా ఆగిపోతే ఇంట్లో ఉంచకూడదని పెద్దలు చెబుతున్నారు. చనిపోయిన వారి ఫోటోలను పూజా గదిలో ఉంచడం మంచిది కాదు. వాటిని పితృ దిశలో మాత్రమే ప్రదర్శించాలి.
చనిపోయిన వారి పరుపు, దుప్పటిని వెంటనే మార్చాలి. వీటిలో బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉందని శాస్త్రం హెచ్చరిస్తుంది. మంచం, పలగాలను మాత్రం శుభ్రం చేసి తిరిగి ఉపయోగించవచ్చు. ఈ నియమాలు భయం కలిగించడానికి కాదు, జీవితంలో సమతుల్యత నేర్పించడానికి అని పురాణం బోధిస్తుంది.







