ఇరాన్ డ్రోన్ దాడితో అమెరికా ప్రతిస్పందించింది. ఇరాన్ మిసైల్ నిల్వలపై ఎటాక్ చేసింది. సీజ్‌ఫైర్ ఉల్లంఘనకు తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా హెచ్చరించింది.
క్రూడ్ ధరలు ఈ వారం 75 డాలర్ల దిగువకు చేరుకున్నప్పటికీ, కొత్త ఉద్రిక్తతలతో మళ్లీ పుంజుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది భారతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ వారం దేశీయంగా విడుదల కానున్న కీలక ఆర్థిక గణాంకాలు (ఐఐపీ, హెచ్‌ఎస్‌బీసీ డేటా), జూన్ ఆటోమొబైల్ అమ్మకాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అంచనా వేస్తున్నారు. రూపాయి మారకంలో ఇటీవలి పుంజుకోవడం కూడా మార్కెట్‌లను ఆకట్టుకుంది.
మార్కెట్ విశ్లేషకులు నిఫ్టీకి ఈ వారం 23,800-24,200 స్థాయిలో మద్దతు/నిరోధకాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. రుతుపవనాల కదలికలు మరియు ఎల్‌నినో ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.






