సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డు-2026 ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సభకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్టూనిస్ట్ శంకర్ మాట్లాడుతూ, కేటీఆర్ తన అభిమాన రాజకీయ నాయకుడని బహిరంగంగానే ప్రకటించారు.
కేటీఆర్ వ్యక్తిత్వంలోని సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ను శంకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఒకరోజు తాను బ్యాగ్ వేసుకొని ఆఫీసు మెట్లు ఎక్కుతుండగా, వెనక నుంచి వచ్చిన కేటీఆర్ 'అన్నా, ఈ బ్యాగ్ లేకపోతే నువ్వు బ్యాలెన్స్ తప్పుతావా? రాత్రి పడుకునేటప్పుడు కూడా అది వేసుకునే పడుకుంటావా?' అని సరదాగా వ్యాఖ్యానించారని శంకర్ తెలిపారు.
అంత పెద్ద రాజకీయ నాయకుడిగా ఉండి కూడా, ఇంట్లో సాధారణ వ్యక్తిలా, తండ్రికి తగ్గ కొడుకులా కేటీఆర్ ఎలా ఉండగలుగుతున్నారని శంకర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంటి నిండా కార్యకర్తలు ఉన్నా, కేటీఆర్ ప్రవర్తించే తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని, ఆ సంఘటన తర్వాతే ఆయనపై తనకు అభిమానం పెరిగిందని శంకర్ వివరించారు.








