హైదరాబాద్‌లోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఎఫ్ బ్లాక్‌లో నివసిస్తున్న హాజిజ్ అబ్దుల్, అదే ప్రాంతానికి చెందిన 9 ఏళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడు బాలికను ముద్దు పెట్టుకుంటూ, ఆమె ప్రైవేట్ భాగాలను తాకుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
నీలోఫర్ ఆస్పత్రి వద్ద టీ అమ్ముకునే హాజిజ్ అబ్దుల్ చర్యలను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గమనించిన బాలిక తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నాలుగో తరగతి చదువుతున్న బాలికపై జరిగిన ఈ అఘాయిత్యంపై ఆగ్రహించిన స్థానికులు, కుటుంబ సభ్యులు నిందితుడిపై దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హాజిజ్ అబ్దుల్‌ను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఈ ఘటనపై కుల్సుంపుర పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ రికార్డింగ్‌లను పరిశీలిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సేకరిస్తూ, అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నారు.






