జమ్మూ కాశ్మీర్ పోలీసు హెడ్ కాన్స్టేబుల్ అశీక్ హుస్సేన్ కురేషిని హత్య చేసిన నిందితుడు మొహమ్మద్ లతీఫ్ భట్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇతను లాష్కర్-ఎ-తైబా అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
ఈ హత్య జూలై 22న జరిగింది. ఈ ఘటన తర్వాత నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇతనిని అరెస్టు చేయడానికి సహకరించిన వారికి రూ. 15 లక్షల నగదు బహుమతిని పోలీసు అధికారులు ప్రకటించారు.
నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు అతని చిత్రాలను పోస్టర్ల రూపంలో ప్రదర్శిస్తున్నారు. ఈ టెర్రరిస్టుకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు కోరుతున్నారు.







