జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుట్టల్లపల్లి గ్రామంలో నివసిస్తున్న అరవింద్ ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఏజెంట్ తనను మోసం చేసి ఎడారి ప్రాంతంలో వదిలేసినట్లు వీడియోలో తెలిపాడు.

సౌదీలో తిండి, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు లేకుండా గొర్రెలకు పెట్టే నీళ్లనే తాగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసాడు. ప్రాణభయంతో రోజులు గడుపుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయిన తర్వాత కుటుంబ సభ్యులు మరియు స్థానికులు అతన్ని త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కోరుతున్నారు.