ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై USA మరియు యూరప్ దేశాల్లో తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగించకూడదని కంపెనీ నిర్ణయించింది. ఈ మార్కెట్లలో కొత్త ఫోన్లు, టాబ్లెట్లు మరియు వేర్‌బ్లెస్‌ల విడుదలలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నిర్ణయానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు గణనీయంగా పడిపోవడం, తయారీ వ్యయం పెరిగిపోవడం మరియు చైనీస్ ఫోన్ బ్రాండ్లపై ఆయా దేశాల్లో పెరుగుతున్న రాజకీయ వ్యతిరేకత ఈ మార్పులకు దారితీశాయి.
భారత మార్కెట్‌లో కూడా OnePlus తన వ్యూహాన్ని మార్చుకుంటోంది. ఇక్కడ కూడా విలీన ప్రక్రియను వేగవంతం చేస్తోంది. 2027 నాటికి ఈ విలీన ప్రక్రియను పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కాలపరిమితిలోపు భారత్‌లో కొత్త ఉత్పత్తుల విడుదలను కంపెనీ క్రమంగా తగ్గించనుంది.








