రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, రైతుల జీవితాల్లో ఆనందం నిండాలని ఆకాంక్షిస్తూ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వరుణ యాగాన్ని చేపట్టారు. ఈ యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సతీమణితో కలిసి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు మరియు వేదపండితుల పర్యవేక్షణలో నిర్వహించారు. మొత్తం 108 మంది రుత్వికులు ఈ యాగానికి హాజరయ్యారు.

యాగ నిర్వహణ కోసం ఆలయ ప్రాంగణంలో 11 హోమగుండాలను ఏర్పాటు చేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ హోమ కార్యక్రమాలు కొనసాగాయి.