నేషనల్ ఫిల్మ్ అవార్డులు దక్కించుకున్న విజేతలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో అభినందనలు తెలుపుతూ పోస్ట్ చేశారు.
తెలుగు సినిమాకు ఇది ఎంతో గర్వకారణమైన క్షణమని జగన్ పేర్కొన్నారు. అవార్డు గ్రహీతల అసాధారణ ప్రతిభ, అంకితభావం మరియు సృజనాత్మకత తెలుగు చలనచిత్ర రంగాన్ని జాతీయ స్థాయిలో నిలబెట్టాయని ఆయన కొనియాడారు.
వీరంతా భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని, తెలుగు సినిమా కీర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని జగన్ ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల నుంచి అవార్డులు గెలుచుకున్న ప్రతిభావంతులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.








