వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానసిక దివ్యాంగుడైన సాంబరెడ్డిపై, ఆయన తమ్ముడి కుమారుడు రాజు అర్థరాత్రి సమయంలో దాడికి పాల్పడ్డాడు.

మద్యం మత్తులో ఉన్న రాజు, కర్రతో సాంబరెడ్డిపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ దాడిలో సాంబరెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నాచినపల్లి గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం నిందితుడు రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.