వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్రైలర్ విడుదలైంది. సూర్య, మమిత బైజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ట్రైలర్ చూస్తుంటే ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో ఈ సినిమాను వెంకీ అట్లూరి తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది. ఇందులో సూర్య లుక్స్, మమిత బైజు నటన ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా సూర్య పాత్ర పేరు సంజయ్ కావడం, ఆయన లుక్స్ ఒకప్పటి 'గజినీ' సినిమాలోని సంజయ్ రామస్వామిని గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి.

గతంలో ధనుష్‌తో 'సార్', దుల్కర్ సల్మాన్‌తో 'లక్కీ భాస్కర్' వంటి విజయాలను వెంకీ అట్లూరి అందుకున్నారు. నాన్ లోకల్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న ఆయన, ఈసారి సూర్యతో కలిసి హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ అంచనాలను మరింత పెంచింది. అన్ని అనుకున్నట్లు జరిగితే వెంకీ అట్లూరి ఖాతాలో మరో విజయం చేరడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఆగస్ట్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.