ప్రభాస్ 'రాజాసాబ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నటి మాళవిక మోహనన్, నిజానికి ఏడేళ్ల క్రితమే టాలీవుడ్‌లోకి రావాల్సింది. విజయ్ దేవరకొండ హీరోగా, మాళవిక మోహనన్ హీరోయిన్‌గా 2019లో 'హీరో' అనే సినిమాను ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, దర్శకుడు ఆనంద్ అన్నామలై ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేశారు.
బైక్ రేసింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందాల్సిన ఈ సినిమా ప్రారంభోత్సవం కొరటాల శివ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో షాలిని పాండే రెండో హీరోయిన్‌గా నటించాల్సి ఉండగా, మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. సుమారు 50 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాలని అప్పట్లో నిర్ణయించారు.
అయితే, మొదటి షెడ్యూల్ కే ఆరు కోట్ల రూపాయలు ఖర్చవ్వడం, వచ్చిన అవుట్‌పుట్ పట్ల విజయ్ దేవరకొండతో పాటు నిర్మాతలు సంతృప్తి చెందలేదు. స్క్రిప్ట్‌లో మార్పులు చేసినప్పటికీ విజయ్ సంతృప్తి చెందకపోవడంతో ఈ ప్రాజెక్టును నిలిపివేశారు. దర్శకుడిని మార్చి సినిమాను కొనసాగించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు.








