వాషింగ్టన్ రాష్ట్రంలో తన కార్యకలాపాలను నిర్వహిస్తున్న Salesforce సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. సీటిల్ మరియు బెల్వూ నగరాల్లో ఉన్న తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న 59 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ తొలగింపు ప్రక్రియ అక్టోబర్ మొదటి రోజు నుండి ప్రారంభం కానుంది. ఈ నిర్ణయంతో వాషింగ్టన్ హబ్‌లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య తగ్గనుంది.
Salesforce సంస్థలో ఉద్యోగులను తొలగించడం ఇది మూడవసారి. వరుసగా జరుగుతున్న ఈ లేఆఫ్స్ (ఉద్యోగాల తొలగింపు) ప్రక్రియలో భాగంగానే తాజా నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది.








