నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహారాజ’ చిత్రం హాలీవుడ్‌లో రీమేక్ కాబోతోంది. హాలీవుడ్‌లో రీమేక్ కానున్న తొలి తమిళ చిత్రంగా ఇది గుర్తింపు పొందిందని ప్యాషన్ స్టూడియోస్ వెల్లడించింది.
2024లో విడుదలైన ఈ సినిమా విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు, ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లోనే కాకుండా చైనాలో కూడా మంచి ఆదరణ పొందింది.
ఈ రీమేక్ ప్రాజెక్టును తమ సంస్థకు ఒక ప్రత్యేకమైన మైలురాయిగా ప్యాషన్ స్టూడియోస్ పేర్కొంది. అయితే, హాలీవుడ్ వెర్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు.
ప్రస్తుతం ఈ సినిమాలో విజయ్ సేతుపతి పోషించిన పాత్రలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఒక స్టార్ హీరో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా హాలీవుడ్ నటుడు మాథ్యూ పేరు వినిపిస్తున్నప్పటికీ, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
త్వరలోనే ఈ చిత్రంలో నటించబోయే నటీనటులు, దర్శకుడు మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను నిర్మాణ సంస్థ ప్రకటించే అవకాశం ఉంది. హాలీవుడ్ నటులతో ఈ కథను ఎలా తెరకెక్కిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








