అమెరికాలోని వాషింగ్టన్ వేదికగా జూలై 25న భారతీయ అమెరికన్ల సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 3,000 మంది భారతీయ అమెరికన్లు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అమెరికా సమాజంలో భారతీయ అమెరికన్లు చూపిస్తున్న ప్రభావాన్ని ఈ సదస్సులో చర్చించనున్నారు. వివిధ రంగాల్లో వారు సాధించిన ప్రగతిని, దేశాభివృద్ధిలో వారి పాత్రను ఈ సందర్భంగా విశ్లేషించనున్నారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారతీయ అమెరికన్ల భాగస్వామ్యం గణనీయంగా ఉంది. వీరు ప్రతి ఏటా అమెరికా ప్రభుత్వానికి చెల్లిస్తున్న ఆదాయ పన్నులు మొత్తం ఆదాయంలో 6 శాతం వరకు ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి.







