అమెరికా ప్రభుత్వం H-1B మరియు L-1 వీసా పెటిషన్లపై కొత్తగా ఫీజులను ఖరారు చేసింది. ఇకపై కంపెనీలు ఒక్కో పెటిషన్‌కు $4,000 నుండి $4,500 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పులు ప్రచురణ జరిగిన 30 రోజుల తర్వాత నుండి అమలులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.
ఈ నిబంధనలు నిర్దిష్ట అర్హత ప్రమాణాల ఆధారంగా వర్తిస్తాయి. మొదటిసారి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారితో పాటు, ఉద్యోగి మార్పు లేదా వీసా పునరుద్ధరణ (renewal) కోసం దరఖాస్తు చేసే వారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.
ఈ వీసా ఫీజుల ద్వారా సేకరించిన నిధులను బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ ప్రోగ్రామ్‌ల నిర్వహణ కోసం అమెరికా ప్రభుత్వం వినియోగించనుంది.






