ఏడాదికి ఒక సినిమా చేయడమే కష్టంగా భావించిన అగ్ర హీరోలు, ఇప్పుడు పక్కా ప్రణాళికలతో బాక్సాఫీస్ మీద దండయాత్రకు సిద్ధమవుతున్నారు. విరామం లేకుండా వరుస రిలీజ్‌లతో ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాతో విజయం సాధించగా, దసరాకు ‘విశ్వంభర’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ వెంటనే డైరెక్టర్ బాబీతో చేస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2027 సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ‘ది రాజాసాబ్’తో పలకరించగా, డిసెంబర్‌లో ‘ఫౌజీ’ సినిమాతో సందడి చేయనున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’ను మార్చిలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
విక్టరీ వెంకటేష్ అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47’తో రానుండగా, ఆ సినిమా రిలీజ్‌కు ముందే అనిల్ రావిపూడి దర్శకత్వంలో కల్యాణ్ రామ్‌తో కలిసి చేస్తున్న మల్టీస్టారర్‌ను వచ్చే ఏడాది సంక్రాంతికి సిద్ధం చేస్తున్నారు. రవితేజ, శర్వానంద్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు కూడా ఇదే బాటలో తక్కువ గ్యాప్‌తో వరుస చిత్రాలను పూర్తి చేస్తున్నారు.








