Telugu » Movies » Mega Hero Mega Blockbuster Varuntej Korean Kanakaraju 3days Collections

Mega hero mega blockbuster VarunTej Korean Kanakaraju 3days collections

VarunTej : చాలా కాలం త‌రువాత మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ సాలిడ్ హిట్‌ను అందుకున్నాడు. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం కొరియ‌న్ క‌న‌కరాజు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. తొలి ఆట నుంచే పాజిటివ్ అందుకున్న ఈ మూవీ మూడు రోజుల్లోనే అదిరిపోయే వ‌సూళ్ల‌ను సాధించింది.

మూడు రోజుల్లో ఈ చిత్రం 35 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. మూడు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన‌ట్లు టీమ్ వెల్ల‌డించింది. ఇటీవ‌ల తొలి వారంతంలోనే ఓ మూవీ బ్రేక్ ఈవెన్ కావ‌డం అరుదైన రికార్డుగానే చెప్ప‌వ‌చ్చు.

ఇక సోమ‌వారం కూడా ఈ చిత్ర అడ్వాన్స్ బుకింగ్ సాలిడ్‌గానే ఉన్న‌ట్లు స‌మాచారం. బ్లాక్ బాస్ట‌ర్ దిశ‌గా వెలుతుంది అని చెప్ప‌డానికి నిద‌ర్శ‌నంగా దీన్ని చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో వ‌రుణ్ తేజ్ కెరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా ఈ మూవీ నిలుస్తుంది అని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు.

హర్రర్‌, థ్రిల్లర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రితికా నాయ‌క్ క‌థానాయిక‌. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించింది.