వందేమాతరం జాతీయ గీతం పవిత్రతను దెబ్బతీసేలా కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరిస్తోందని బీజేపీ జాతీయ సహ-ఇన్‌ఛార్జ్ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ గీతం కేవలం పాట మాత్రమే కాదని, భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తికి, జాతీయ గౌరవానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వం వందేమాతరం పూర్తి రూపానికి, దాని చారిత్రక నేపథ్యానికి తగిన గుర్తింపు ఇచ్చిందని పొంగులేటి గుర్తుచేశారు. జాతీయ గీతం విషయంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని ప్రజలకు స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వాలు మారవచ్చు కానీ, వందేమాతరం పట్ల ఉండాల్సిన గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుందని ఆయన అన్నారు. దేశ ఐక్యతను కాపాడటానికి ఈ గీతం ప్రాముఖ్యతను, చరిత్రను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.








