వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నరసరావుపేట జిల్లాలోని వివిధ అనుబంధ విభాగాలకు కొత్త సభ్యులను పార్టీ నియమించింది. ఈ నియామకాలకు సంబంధించి కేంద్ర పార్టీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

రైతు విభాగం జిల్లా కమిటీలో పలువురికి బాధ్యతలు అప్పగించారు. నాలి రామయ్య, గుత్తా వేములయ్య, మన్నెం పెదగురవయ్యలను ఉపాధ్యక్షులుగా, యలమారెడ్డి కోటిరెడ్డిని ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అరికట్ల పున్నారెడ్డి, కాట్రగడ్డ రామకృష్ణ, పాశం పాపిరెడ్డి, పాలపాల శ్రీనివాసరావు, పేరం రమేష్‌రెడ్డి కార్యదర్శులుగా, పొట్లపాటి చంద్రారెడ్డి, అలవాల వెంకటరెడ్డి, పొలగాని అంజయ్య, గోగినేని శ్రీనివాసరావు, కురకుల వెంకటేశ్వర్లు ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

మహిళా విభాగం జిల్లా కమిటీలోనూ కొత్త నియామకాలు జరిగాయి. తొర్లకొండ మంగమ్మ, కిల్లా రత్నకుమారి ఉపాధ్యక్షులుగా, యర్రం లక్ష్మి, మహంకాళి యశోధదుర్గా ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యారు. అన్నెం అనంతవర్మ, షేక్‌ మీరాభి, చింతలచెరువు వెంకటరమణ కార్యదర్శులుగా, ఆదిరాల నాగమణి, లాకా వెంకటరమణ, పొత్తూరి వాణి, చేంబేటి భారతి, షేక్‌ శిలార్‌భీ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పని చేయనున్నారు.

జిల్లా పబ్లిసిటీ వింగ్‌ (ప్రచార విభాగం) కమిటీలోనూ మార్పులు చేశారు. మిట్టా జంగమయ్య ఉపాధ్యక్షులుగా, కొండా సంతోష్‌కుమార్‌రెడ్డి, పాశం శ్రీనివాసరెడ్డి ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యారు. షేక్‌ అజహర్‌ హుస్సేన్‌ను కార్యదర్శిగా పార్టీ నియమించింది.

పార్టీ అధిష్టానం జారీ చేసిన ఈ ఉత్తర్వులతో జిల్లాలోని అనుబంధ విభాగాల కమిటీల కూర్పు పూర్తయింది. నియమితులైన వారంతా త్వరలోనే తమ బాధ్యతలను స్వీకరించనున్నారు.