ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలకే పరిమితమైన తెలుగు ప్రేక్షకుల ఆసక్తి, ఇప్పుడు కొరియన్ సినిమాలు మరియు డ్రామాల (K-Drama) వైపు మళ్లింది. ముఖ్యంగా యువతలో ఈ కంటెంట్‌కు ఉన్న క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, కొరియన్ కంటెంట్‌ను అత్యధికంగా వీక్షిస్తున్న వారిలో తెలుగు ప్రేక్షకులు ముందున్నారని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా గుర్తించింది.
ప్రేక్షకులు సబ్‌టైటిల్స్ చదవాల్సిన అవసరం లేకుండా, సొంత భాషలోనే కొరియన్ కథలను ఆస్వాదించేలా అమెజాన్ ప్రైమ్ వీడియో చర్యలు చేపట్టింది. ఇందుకోసం కొరియాకు చెందిన ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ CJ ENMతో బహువార్షిక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా రానున్న రెండేళ్లలో 100కు పైగా కొరియన్ టైటిల్స్ భారత ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి.
ఇప్పటికే 'Squid Game', 'Crash Landing on You', 'Queen of Tears', 'Business Proposal', 'Goblin' వంటి డ్రామాలు భారతదేశంలో మంచి గుర్తింపు పొందాయి. తెలుగు డబ్బింగ్‌తో ఈ కంటెంట్‌ను అందించడం ద్వారా ప్రేక్షకుల సంఖ్య మరింత పెరుగుతుందని సంస్థ భావిస్తోంది.
ఈ ఒప్పందంలో భాగంగా ప్రతి నెలా ఒక కొత్త కొరియన్ సినిమా లేదా వెబ్ సిరీస్‌ను విడుదల చేయాలని అమెజాన్ ప్రైమ్ ప్రణాళిక సిద్ధం చేసింది. భారత డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్‌లో కొరియన్ కథలకు ఇస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ సంస్థలు పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారింది.





