ఆంధ్రప్రభ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన రెండు రాష్ట్రాల ఆర్థిక వృద్ధికి దోహదపడిందని ఇప్పుడు స్పష్టమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొత్తం జీడీపీ పొరుగు రాష్ట్రమైన తమిళనాడు కంటే తక్కువగా ఉండేది. విభజనానంతరం పరిస్థితి మారింది. తెలంగాణ తన ఐటీ, సర్వీస్ రంగాలతో గ్లోబల్ హబ్ గా ఎదిగితే.. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్, ఆక్వా, సుదీర్ఘ తీరప్రాంత పారిశ్రామిక వృద్ధిని అందిపుచ్చుకుంది. నేడు రెండు తెలుగు రాష్ట్రాల విడివిడి జీడీపీలను కలిపి చూసినా, లేదా వాటి వృద్ధి రేటును విడివిడిగా
పరిగణనలోకి తీసుకున్నా.. పారిశ్రామిక దిగ్గజమైన తమిళనాడును మించిపోవడం విభజన తెచ్చిన అతిపెద్ద ఆర్థిక సానుకూలాం శంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణ, ప్రత్యేక బడ్జెట్లు, స్థానిక వనరులపై పట్టు సాధించడం వల్లే ఈ అద్భుత ప్రగతి సాధ్యమైందని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఆర్బీఐ నివేదిక ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. దీంతో పెద్ద ఎత్తున రెండు రాష్ట్రాలలో చర్చ జరుగుతున్నది. పొరుగు రాష్ట్రం ఏపీతో పోలిస్తే తెలంగాణ
తలసరిలో అందనంత ముందంజలోకొంత వెనుకబడుతున్నది. పెద్దగా ఐటీరంగం, ఇతర వర సతులేమీ లేని పొరుగు రాష్ట్రంలో ఏపీ అనూహ్యంగా జీఎస్ఓపీలో తెలంగాణను దాటేసింది. ఇప్పుడీ అంశం పెద్ద చర్చకు దారితీస్తున్నది. రాష్ట్రాలు ఎంత అభివృద్ధి చెందితే దేశ ఆర్థిక వ్యవస్థ అంత బలపడుతుంది. తెలంగా ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి వివరాలు రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక పురోగతిని ప్రతిబింబిస్తాయి. హైదరాబాద్ వంటి ప్రధాన మెట్రోపాలిటన్ కేంద్రం, ఐటీ, సేవా రంగాలు బలంగా ఉండటం వల్ల తెలంగాణ జీఎస్ఓపీ, తలసరి ఆదాయం వేగంగా వృద్ధి చెందాయి. మరోవైపు వ్యవసాయం, పారిశ్రామిక, ఇతర ఎగుమతుల రంగాలపై ఆధారపడి ఆంధ్రప్రదేశ్ కూడా స్థిరమైన ఆర్థిక వృద్దిని సాధిస్తోంది.ఆర్థిక స్థితిగతులు…ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ జీఎస్ఓపీ దాదాపు రూ. 19.61 లక్షల కోట్లకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కూడా దాదాపు ఇదే స్థాయిలో పోటీ పడుతూ రూ. 13 లక్షల కోట్ల నుంచి రూ. 19.75 లక్షల కోట్ల పైచిలుకు జీఎస్ఓపీ అంచనాలతో ముందుకు సాగుతోంది. జనాభా ప్రాతిపదిక `న చూస్తే, దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆంధ్రప్రదేశ్ కూడా గణనీయమైన వృద్ధిని కనబరుస్తోంది. వృద్ధికి ప్రధాన కారణాలుగా సేవా రంగం, ఐటీ నిలుస్తున్నా యి. తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా ఐటీ, రియల్ ఎస్టేట్, సేవా రంగాలు జీఎస్ఓడీపీ వృద్ధిలో సింహభాగంగా వాటా కలిగి ఉన్నాయి. అయితే వ్యవసాయం, మౌలిక వ ఎతులలో ఏపీ మెరుగ్గా ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో వ్యవసా యోత్పత్తులు, ఆక్వాకల్చర్, తీరప్రాంత ఎగుమతులు, మౌలిక వసతుల నిర్మాణం ఆర్థిక వ్యవస్థకు ప్రధాన పురోగతికి కారణమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి, ఆర్థిక వృద్ధి వివరాలు ప్రస్తుత ధరల ప్రకారం ఏపీ జీఎస్టీపీ దాదాపు రూ. 19.75 లక్షల కోట్లకు చేరుకోగా, తెలంగాణ జీఎస్టీపీ సుమారు రూ.19.61 లక్షల కోట్లకు పైగా ఉంది. ఇటీవల విడుదలైన నివేదికల ప్రకారం ఏపీ వృద్ధి రేటు సుమారు 11.3శాతం ఉండగా, తెలంగాణ వృద్ధి రేటు 10.7శాతంగా నమోదైందిఏపీకి కలసివచ్చిన పీపీపీఆంధ్రప్రదేశ్ జీఎస్ఓపీ వృద్ధి చెందడానికి ప్రధాన కారణం ఆర్థిక విధానాల్లో మార్పులు, పునరుద్ధరణ ప్రయత్నాలతోపాటు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఏపీలో పీపీపీ విధానంలో భారీ ప్రాజెక్టుల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేయడం. ఆర్థిక ప ఎనరుద్ధరణ వంటి చర్యలు ఊతంగా మారాయి. గత కొన్ని సంవత్సరాల మందగమనం తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మళ్లీ కోలుకుని మెరుగైన వృద్ధి సాధిస్తుండటం ఏపీ పురోభివృద్ధికి సాక్ష్యంగా నిలుస్తున్నది. ఏపీలో సేవా, పారిశ్రామిక రంగాలతోపాటు వివిధ ఆర్థిక కార్యకలాపాలు క్రమేపీ పెద్ద ఎత్తున పుంజుకోవడం వల్ల ప్రస్తుత ధరల వద్ద వృద్ధి రేటు భారీగా 12శాతంపైగా అంచనా వేసుకున్నారు.తెలంగాణకు కీలకంగా హైదరాబాద్ తెలంగాణ వృద్ధిలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తున్న ది. ఐటీ, సేవారంగం అద్భుత రీతిలో ఎవరూ కాదనలేని రీతిలో బలంగా ఉండటం వల్ల తెలంగాణ తలసరి ఆదాయం, జీఎస్ఓపీ వృద్ధి గతంలోనూ, ప్రస్తుతమూ స్థిరమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నాయి. ఆర్థిక వృద్ధిలో రెండు రాష్ట్రాలు ఒకేలా దూసుకుపోతు న్న ప్పటికీ, రాజకీ యాల్లో మాత్రం పూర్తిగా భిన్నమైన ధృవా లుగా నిలిచా యి. తెలంగాణ మలిదశ రాజకీయాల్లో జాతీ య పార్టీల హవా స్పష్టంగా కనిపిస్తోంది. పదేళ్ల ప్రాంతీయ పార్టీ పాలన తర్వాత, ప్రజలు జాతీయ పార్టీ అయిన కాంగ్రెసు పట్టం కట్టారు. దీనికి భిన్నంగా, ఆంధ్రప్రదేశ్లో మాత్రం దశాబ్ద కాలంగా ప్రాంతీయ పార్టీలదే గుత్తాధిపత్యం. అక్కడ వైఎస్సార్సీపీ, తెలుగుదేశం, జనసేన వంటి ప్రాంతీయ శక్తుల చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు అక్కడ క్షేత్రస్థా యిలో ఓటు బ్యాంకు సాధించడం ఇప్పటికీ సవాలుగానే మిగిలింది. ఒక రాష్ట్రంలో చక్రం తిప్పే శక్తులు, పక్క రాష్ట్ర సరిహద్దు దాటితే కనీస ప్రభావం చూపలేకపోవడం తెలుగు రాజకీయంలోని విచిత్రమైన పరిణామం. ఒకప్పుడు రాష్ట్రమంతటా ప్రభావం చూపిన టీడీపీ ఏపీకి పరిమితం కాగా.. కాంగ్రెస్ .. తెలంగాణ వరకే ప్రభావం చూపిస్తోంది.ఇప్పటికీ మారనిఆంధ్రా బూచి రాజకీయం అయితే తెలంగాణ ఏర్పడి పన్నెండేళ్లు గడిచినా, ఇక్కడి రాజకీయాల్లో ఆంధ్రాబూచిని చూపించే వ్యూహం మాత్రం ఇంకా సజీవంగానే ఉంది. తెలంగాణ అస్తిత్వాన్ని, సెంటిమెంట్ను రగిల్చేందుకు పక్క రాష్ట్ర నేతల పర్యటన లను, పెట్టుబడులను సాకుగా చూపి స్థానిక నేతలు రాజకీ యం చేయడం ఇంకా మామూలుగానే కొనసాగుతున్నది. ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనపై సాగుతున్న ఆందోళనలు, దిగువ రాష్ట్రమైన ఏపీ ప్రాజెక్టుల విషయంలో వస్తున్న ఆరోపణలు గానీ దీనికి నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. పరిపాలనా పరంగా, ఆర్థికంగా తెలంగాణ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పటికీ.. ఎన్నికల లబ్ది కోసం లేదా ప్రజల దృష్టిని మళ్లించడం కోసం సంప్రదాయ పార్టీలు నేటికీ ఆంధ్రా- తెలంగాణ భావోద్వేగాలనే నమ్ముకోవడం రాజకీయ అపరిపక్వతకు అద్దం పడుతోందనే చర్చ జోరందుకున్నది.మౌలిక సదుపాయాలు –
పోటీ తత్వంవిభజన తెచ్చిన మరో సానుకూల మార్పు రెండు రాష్ట్రాల మధ్య పెరిగిన ఆరోగ్యకరమైన పోటీ. హైదరాబాద్ కు పోటీగా ఏపీలో అమరావతి నగరం ఇప్పుడు కేంద్ర నిధులతో శరవేగంగా పుంజుకుంటోంది. ఇటు తెలంగా ణలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్ వంటి పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒకప్పుడు నిధుల కేటాయింపుల్లో వివక్ష ఉందనే భావన ఉండేది, కానీ ఇప్పుడు ఎవరి వ్యూహాలు, ఎవరి ప్రాధాన్యతలు వారికున్నాయి. ఈ పోటీ తత్వం వల్ల రెండు రాష్ట్రాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పన వేగవంతమైంది. భావోద్వేగాలను పక్కన పెట్టి చూస్తే, విభజన అనేది తెలుగు ప్రజలందరికీ మేలు చేసిందనేది అటు వృద్ధి రేట్లు, ఇటు జీవన ప్రమాణాలు స్పష్టం చేస్తున్నాయి.








