టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ డింపుల్ హయాతీ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాతో పాటు, వెంకటేష్ నటించిన 'ఆదర్శ కుటుంబం'లో సెకెండ్ హీరోయిన్ గా ఆమె నటించారు. ఇప్పుడు శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న 'భోగి' సినిమాలో డింపుల్ నూతస పాత్రలో కనిపించనున్నారు.

ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ మరో హీరోయిన్ గా నటించారు. ఈనవంబర్ 27వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, పాటలు, ట్రైలర్ కు మంచి స్పందన లభించింది.

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో మందారం రంగు చీరలో వచ్చిన డింపుల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే హీరో శర్వానంద్ తో ఆమె సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

వీటిని చూసిన ఓ నెటిజన్ డింపుల్ కు పెళ్లయిపోయిందా అని కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన డింపుల్ 'ఐ యామ్ నాట్ మ్యారీడ్' అంటూ బదులిచ్చారు. గతంలోనూ ఆమెకు పెళ్లయిపోయినట్లు, భర్త పేరు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం తాను సింగిల్ అని ఈ ఫన్నీ రిప్లై ద్వారా ఆమె క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమాలో తాను 'మందారం' అనే శక్తివంతమైన పాత్రలో నటించినట్లు డింపుల్ తెలిపారు. కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా తన కెరీర్ లో మైలురాయిగా నిలుస్తుందని, ఇప్పటివరకు తనపై ఉన్న గ్లామర్ ఇమేజ్ ను ఇది పూర్తిగా మార్చేస్తుందని ఆమె చెప్పారు.