తమిళనాడు అసెంబ్లీ సమావేశాలకు TVK పార్టీ ఎమ్మెల్యే ఆర్ పల్లవి తన పసిబిడ్డను తీసుకువస్తున్నారు. కొన్ని నెలల వయసున్న బిడ్డను ఎత్తుకుని ఆమె సభకు హాజరవుతుండటం ప్రస్తుతం చర్చకు దారితీసింది.
సభ జరుగుతున్న సమయంలో పల్లవి తన బిడ్డను ఒక సహాయకురాలి పర్యవేక్షణలో ఉంచుతున్నారు. విరామ సమయాల్లో ఆమె స్వయంగా బిడ్డ బాగోగులను చూసుకుంటున్నారు.
ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు పసిబిడ్డను తీసుకురావడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని కొందరు విమర్శిస్తున్నారు.
మరోవైపు, ఒక తల్లిగా బాధ్యతలను నెరవేరుస్తూనే ప్రజాప్రతినిధిగా విధులు నిర్వహించడం అభినందనీయమని మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
ఈ విమర్శలపై ఎమ్మెల్యే పల్లవి స్పందించారు. బిడ్డకు చాలా తక్కువ వయసు ఉండటంతో ఇంట్లో వదిలి రావడం సాధ్యం కాదని ఆమె వివరించారు. తల్లిగా, ఎమ్మెల్యేగా తన బాధ్యతలను ఏకకాలంలో నిర్వర్తించడంలో ఎలాంటి తప్పు లేదని ఆమె స్పష్టం చేశారు.
ఎవరికీ ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశం తనకు లేదని పల్లవి తెలిపారు. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు.








