తెలుగు నటుడు సుహాస్, తమిళ నటుడు సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'మండాడి'. ఈ చిత్రాన్ని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో సుహాస్ మెయిన్ విలన్ అంటే ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారు. తెలుగులో కామెడీ, హీరో, విలన్ పాత్రలతో మెప్పించిన సుహాస్, ఈ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సముద్రం నేపథ్యంలో బోట్ పోటీల చుట్టూ ఈ కథ సాగుతుంది.
సుహాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆయన కొత్త లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో సుహాస్ మేకోవర్, ఆయన చేతికి ఉన్న ఉంగరం, గడియారం ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఈ లుక్ చూస్తుంటే సుహాస్ ఏదో యాక్షన్ సన్నివేశానికి సిద్ధమవుతున్నట్లు అనిపిస్తోంది.
ఈ సినిమాలో మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్నారు. వీరితో పాటు సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.
సెప్టెంబర్ 10న ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతున్నారు.








