వెల్దుర్తి గ్రామంలో నివసిస్తున్న జొన్నల సాయికుమార్‌ను ఈ నెల 15న వాహన దొంగతనుల కేసులో చిన్నకోడూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

శనివారం సాయికుమార్‌తో పాటు మరో ఆరుగురు ఖైదీలను ఆరోగ్య పరిశీలన కోసం సిద్దిపేట జిల్లా జైలు నుండి ప్రత్యేక వాహనంలో తరలించారు. సిబ్బంది సాయికుమార్‌కు హ్యాండ్ కప్స్, లీడింగ్ చైన్ తొలగించిన తర్వాత అతను ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా పారిపోయాడు.

పోలీసులు వెంటనే పరిశోధనలు ప్రారంభించి సమీప ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. సిద్దిపేట వన్ టౌన్ సీఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, 'ఈ ఖైదీని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ బృందాలు కృషి చేస్తున్నాయని' తెలిపారు.