ఓబులదేవరచెరువు మండలం మిట్టపల్లికి చెందిన ఫయాజ్, నల్లమడకు చెందిన మల్లీశ్వరి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఏకాంతంగా గడిపేందుకు వీరు కదిరి మండలం బత్తలపల్లి తండా అటవీ ప్రాంతానికి ఆటోలో వెళ్లారు.

అక్కడ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో, ఒక్కసారిగా విద్యుత్ తీగలు తెగి వీరిపై పడ్డాయి. దీనివల్ల ఇద్దరికీ విద్యుత్ షాక్ తగిలి తీవ్రమైన అరుపులు వినిపించాయి.

ప్రేమ జంట కేకలు విన్న గొర్రెల కాపరులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని చూసి గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు.

ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ఫయాజ్‌కు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం అతడిని బెంగళూరుకు తరలించారు. స్వల్ప గాయాలతో బయటపడిన మల్లీశ్వరిని అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.