బెహారీ లాల్ ఎంజినీరింగ్ తన ఐపీఓ (IPO - ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ధరల శ్రేణిని ఒక్కో షేరుకు ₹271 నుంచి ₹285 మధ్య ఖరారు చేసింది. ఈ పబ్లిక్ ఇష్యూ ఆగష్టు 12న సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి రానుంది.
ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.301 కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని సమీకరించాలని యోచిస్తోంది. సేకరించిన ఈ నిధులను కంపెనీ తన తయారీ సామర్థ్యాన్ని విస్తరించుకోవడానికి వినియోగించనుంది.
అంతేకాదు, రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటుకు, కంపెనీపై ఉన్న అప్పులను తీర్చుకోవడానికి ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ ఉపయోగించనుంది.








