రాష్ట్రంలో బైపిసి (BiPC) చదివిన విద్యార్థులకు ఫార్మసీ కళాశాలల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ సెప్టెంబర్ 12 నుంచి మొదలవుతుంది. ఈ మేరకు ఎప్‌సెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు.
మొదటి విడతలో భాగంగా విద్యార్థులు సెప్టెంబర్ 12 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఈ ప్రక్రియ ముగిశాక సెప్టెంబర్ 21న మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 21, 22 తేదీల్లో ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
రెండో విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 25న సర్టిఫికెట్ వెరిఫికేషన్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 26, 27 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు.
సెప్టెంబర్ 29న రెండో విడత సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్ రిపోర్టింగ్ పూర్తి చేసి, అక్టోబర్ 1వ తేదీ లోపు సంబంధిత కళాశాలల్లో చేరాలి.
అక్టోబర్ 2వ తేదీన స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారులు జారీ చేస్తారు. మిగిలిన సీట్ల భర్తీకి ఈ మార్గదర్శకాలు కీలకం కానున్నాయి.







