మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న రా అండ్ రస్టిక్ చిత్రం 'మండాడి'. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో సుహాస్, సూరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మహిమా నంబియార్ కథానాయికగా నటించగా, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు.

ఈ సినిమాను సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి భారీ స్థాయిలో విడుదల చేయనుంది.

సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం పేర్కొంది. ముఖ్యంగా బోట్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని ఇప్పటికే వెల్లడించారు. సుహాస్, సూరి పాత్రల మేకోవర్ కూడా ప్రత్యేకంగా ఉండనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా, డి.ఆర్.కె. కిరణ్ ప్రొడక్షన్ డిజైన్, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటింగ్ చేశారు. పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేశారు.