తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర విద్యాశాఖ విఫలమైందని విమర్శించారు. నేటి యువతకు 'జై యువా' నినాదం బలంగా వినిపిస్తుందని, ED/CBI బెదిరింపులకు భయపడట్లేదని స్పష్టం చేశారు.

విద్యార్థుల నిరసనలపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, NEET బాధితులకు తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ వయోపరిమితి తగ్గించాలని ప్రకటించారు.

ఎమ్మెల్యే అభ్యర్థుల కనీస వయస్సును 21కి, ఎంపీ అభ్యర్థుల వయస్సును 25కి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ బిల్లు పార్లమెంట్లో త్వరలో ప్రవేశపెట్టబడుతుందని తెలిపారు.