ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జయమాల్య బాగ్చి, వి. మోహనలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదలైన కారణంగా, దీనిపై అత్యవసర విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది.
దర్శకులు తమ అవగాహన మేరకు కథలను తెరకెక్కించే స్వేచ్ఛ వారికి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ సినిమాలోని అంశాలపై ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటే, వారు సొంతంగా మరో సినిమా తీయవచ్చని కోర్టు సూచించింది.
ఈ చిత్రాన్ని దర్శకుడు నితీష్ తివారీ రూపొందించగా, నమిత్ మల్హోత్రా నిర్మించారు. ఇది రెండు భాగాలుగా రానున్న రామాయణంలో మొదటి భాగం.








