Telugu » Andhrapradesh » Rain Alert Meteorological Department Warned Of Possibility Of Heavy Rains In Andhra Pradesh And Telangana Next 48 Hours

Meteorological Department warned of possibility of heavy rains in Andhra Pradesh and Telangana next 48 hours

Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రానున్న రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఇటీవల కొన్ని రోజులుగా వేడి, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ఈ వాతావరణ మార్పు కొంత ఊరటనిచ్చింది. అయితే వర్షాలతో పాటు కొన్నిచోట్ల ఈదురుగాలులు, పిడుగులు పడే ముప్పు కూడా ఉందని అధికారులు భావిస్తున్నారు.

వచ్చే 48 గంటల్లో రెండు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మంతో పాటు హైదరాబాద్ పరిసర జిల్లాల్లో సాయంత్రం వేళల్లో వానలు(Rain Alert) పడవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనుండగా, రాయలసీమ వ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందాని అంచనా వేశారు.

పరిస్థితి తీవ్రతను బట్టి శ్రీకాకుళం, విజయనగరం వంటి ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, ప్రజలు పాత భవనాలు, చెట్ల కింద నిలబడవద్దని సూచించారు. లోతట్టు ప్రాంత వాసులు, పొలాల్లో పనిచేసే రైతులు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.