వాస్తు శాస్త్రం ప్రకారం, డమరుకం నుంచి వచ్చే ధ్వని ఇంటి మూలల్లో నిలిచిపోయిన ప్రతికూల శక్తులను తొలగిస్తుందని నమ్మకం. ఈ శబ్దం ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేసి, ప్రశాంతతను పెంచుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

పిల్లలు చదువులో ఏకాగ్రత కోల్పోతున్నప్పుడు, వారి చదువు గదిలో డమరుకాన్ని ఉంచడం శుభసూచకంగా భావిస్తారు. ఇది మానసిక ప్రశాంతతను పెంచి, చదువుపై దృష్టి పెంచుతుందని విశ్వాసం. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో అడ్డంకులు ఎదురవుతున్నవారు డమరుకాన్ని ఈశాన్య దిశలో ఉంచాలని సూచిస్తున్నారు.

పూజా సమయంలో శివుడిని స్మరిస్తూ డమరుకాన్ని మోగిస్తే, అడ్డంకులు తగ్గి కొత్త ఆదాయ మార్గాలు తెరుస్తాయని నమ్మకం. ఈ పద్ధతిని చాలా మంది ఇంట్లో పూజా మందిరంలో అమలు చేస్తున్నారు.

ఈ సమాచారం వాస్తు శాస్త్రం మరియు సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. విశ్వాసం వ్యక్తిగతమైనది.