చాలామంది తమ ఫోన్ ఒక్కసారిగా ఆన్ కాకపోతే అది పూర్తిగా పాడైందని కంగారు పడుతుంటారు. అయితే, ప్రతిసారీ ఫోన్ ఆన్ కాకపోవడానికి హార్డ్‌వేర్ సమస్యలే కారణం కావు. బ్యాటరీ, ఛార్జర్ లేదా చిన్న సాఫ్ట్‌వేర్ లోపాల వల్ల కూడా ఫోన్ ఆన్ కాకపోవచ్చు.
మొదట మీ ఫోన్‌ను మంచి ఛార్జర్, కేబుల్‌తో కనీసం 20 నుంచి 30 నిమిషాలు ఛార్జింగ్ పెట్టండి. బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయినప్పుడు స్క్రీన్‌పై డిస్‌ప్లే రావడానికి కొంత సమయం పడుతుంది. ఒకవేళ ఛార్జింగ్ ఎక్కకపోతే, ఛార్జర్ లేదా కేబుల్‌ను మార్చి చూడండి. సమస్య వాటిలో కూడా ఉండవచ్చు.
ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లో దుమ్ము పేరుకుపోయినా ఛార్జింగ్ ఎక్కదు. కాబట్టి, ఆ పోర్ట్‌ను జాగ్రత్తగా క్లీన్ చేసి చూడండి. ఒకవేళ ఫోన్ హ్యాంగ్ అయితే, పవర్ మరియు వాల్యూమ్ డౌన్ బటన్లను 10 నుంచి 15 సెకన్ల పాటు నొక్కి ఉంచడం ద్వారా ఫోర్స్ రీస్టార్ట్ చేయవచ్చు.
ఇటీవల ఇన్‌స్టాల్ చేసిన యాప్ వల్ల సమస్య వస్తుంటే, సేఫ్ మోడ్‌లోకి వెళ్లి ఆ యాప్‌ను డిలీట్ చేయండి. అన్ని ప్రయత్నాలు విఫలమైతే, ఫ్యాక్టరీ రీసెట్ చేయడం చివరి మార్గం. అయితే, ఈ సెట్టింగ్ ఎంచుకుంటే మీ ఫోన్‌లోని డేటా మొత్తం డిలీట్ అవుతుందని గుర్తుంచుకోండి.
ఫోన్ కింద పడినా లేదా నీటిలో తడిచినా కూడా కొన్నిసార్లు మొబైల్ ఫోన్లు హ్యాంగ్ అవుతుంటాయి. ఈ పద్ధతుల ద్వారా ఫోన్ రీబూట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ పద్ధతులు పాటించినా ఫోన్ ఎలాంటి స్పందన ఇవ్వకపోతే, అప్పుడు తప్పనిసరిగా సర్వీస్ సెంటర్‌కు వెళ్లడం మంచిది.








